విభజన నేపథ్యంలో రెండు రాష్ర్టాలు అవుతున్నాయి. మరి ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమల్లో రెండవది అయిన మన టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు ఒకకటేనా..? ఒకవేళ రెండు అయితే? అప్పుడు కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుంది? తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. ముఖ్యంగా సినీ కార్మికుల్లో. విడిపోయిన తరువాతైనా... తమ జీవితాల్లో మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. చిత్ర నిర్మాణంలో సినీ కార్మికులే కీలకం. వారి సహకారం లేనిదే వెండితెర మెరవదు. అలాంటి వారి బతుకులు ఇప్పటికీ సినిమాల్లో కష్టాల్లాగే తెల్లారుతున్నాయి. మరి కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాతైనా వారి జీవితం మెరుగవుతుందా? వారి వేతనాల్లో మార్పులొస్తాయా? వీరికి రెండు చోట్లా వర్క్‌వుట్ అవుతుందా అనేది సినీ కార్మికుల్లో ఆసక్తిరేపుతోంది.తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో విస్తరించనుంది. మరి ఇలాంటి సమయంలో టాలీవుడ్ పరిస్థితి ఎలాంటి ఉంటుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగొలుపుతోంది.
Read more: http://www.mymovieflix.com/tnews/What-about-Tolly-wood-cine-workers-life-1243#ixzz2uDMbJouN
What about Tolly wood cine workers life
No comments:
Post a Comment