తమిళ ఇళయదళపతి విజయ్ కి జంటగా నటించాలంటే రోజుకు కోటివ్వాలంటోందట బాలీ వుడ్ క్రేజీ భామ దీపికా పదుకునే. అంతేకాదు ఈ డీల్ కి ఓకే అంటే ఎన్ని కాల్‌షీట్స్ అయినా ఇస్తానంటోందట ఈ ముద్దు గుమ్మ. జిల్లా సినిమా తరువాత విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. అయితే విజయ్ దీంతోపాటు మరో దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఫాంటసీ కథాంశంతో కూడిన ఈ చిత్రం హీరోయిన్‌గా దీపికా పదుకునేను నటింపచేసే ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే పారితోషికం మాత్రం రోజుకు కోటి రూపాయలు చొప్పున చెల్లించాలని ఆర్డర్ వేసిందట. దాంతో షాక్ కు గురికావడం నిర్మాతల వంతు అయింది.
Read more: http://www.mymovieflix.com/tnews/Deepika-demands-one-Crore-for-one-day-1139#ixzz2sXj67bT2
Deepika demands one Crore for one day..!
No comments:
Post a Comment